సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం వచ్చే మంగళవారం మళ్లీ మరో రూ.3వేల కోట్లు అప్పు చేయనుంది. ఏపీ ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా రూ.3వేల కోట్లు అప్పు చేయనున్నట్లు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ) శుక్రవారం నోటిఫై చేసింది. ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా రూ.3వేల కోట్లను ఆర్‌బీఐ సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది.


