యువతకు సీఎం జగన్‌ పెద్దపీట..

Avanthi Srinivas Said Future Of The Country Was In Hands Of Youth - Sakshi

విశాఖ ఉడా చిల్డ్రన్‌ థియేటర్‌లో జాతీయ యువజన దినోత్సవం

సాక్షి, విశాఖపట్నం: ప్రపంచాన్ని భారతదేశ యువత శాసిస్తుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం ఆయన విశాఖ నగరంలోని ఉడా చిల్డ్రన్‌ థియేటర్‌లో నిర్వహించిన జాతీయ యువజన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రితో పాటు ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గొల్ల బాబురావు, వైఎస్సార్‌సీపీ నేతలు కోలా గురువులు, కేకే రాజు, మళ్ల విజయ ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ, దేశ భవిష్యత్‌ యువత చేతుల్లో ఉందని ఎప్పుడో వివేకానంద చెప్పారన్నారు. యువతకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ప్రతి జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారని మంత్రి అవంతి పేర్కొన్నారు. (చదవండి: దుర్గమ్మను దర్శించిన బండారు దత్తాత్రేయ)
(చదవండి: ఏపీకి వ్యాక్సిన్‌ వచ్చేస్తోంది..)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top