మంగళగిరి ఎన్నారై ఆసుపత్రికి అచ్చెన్నాయుడు

Atchannaidu Sent To Mangalagiri NRI Hospital For Corona Treatment - Sakshi

సాక్షి, గుంటూరు : ఈఎస్‌ఐ స్కాంలో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడును శనివారం రాత్రి మంగళగిరి ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రమేష్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్‌ రావడంతో మెరుగైన చికిత్స కోసం మంగళగిరి ఎన్నారై ఆసుపత్రికి తరలించారు.  కాగా, ఈఎస్‌ఐ మందుల కొనుగోలులో 150 కోట్ల రూపాయలు అవకతవకలు జరిగాయని అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జూన్ 12వ తేదీన అచ్చెన్న స్వగ్రామం నిమ్మాడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ హయాంలో అచ్చెన్నాయుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు.(చదవండి : ‘ఈఎస్‌ఐ స్కామ్‌లో ఎవరి వాటా ఎంతో తేలుస్తాం’)

ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి అచ్చెన్నాయుడుతో సహా 12 మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. మొత్తం 19 మందిపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న మాజీ మంత్రి పితాని తనయుడితో పాటు మిగిలిన వారి కోసం ఏపీ, తెలంగాణలో గాలిస్తున్నారు. ఈ క్రమంలో విచారణలో భాగంగా కాల్‌ సెంటర్‌లో చూపించిన కాల్స్‌ అన్నీ నకిలీవేనని అధికారులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి త్వరలోనే చార్జిషీట్ దాఖలు చేస్తామని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top