మోదీ అంటే చంద్రబాబుకు భయం

AP Minister Appalaraju Fires on Chandrababu Naidu - Sakshi

విశాఖ ప్లాంట్‌పై మంత్రి డా. సిదిరి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు హయాంలోనే ప్రైవేటీకరణకు అడుగులు

శ్రీకాకుళం: ఏ ముఖం పెట్టుకుని చంద్రబాబు విశాఖ వచ్చాడని మంత్రి డా. సిదిరి అప్పలరాజు ప్రశ్నించారు. తన మాటలతో ప్రజల్ని రెచ్చగొడుతున్నాడని మండిపడ్డారు. మాకేమన్న ఉద్యమాలంటే కొత్త అని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ఉద్యమాల గడ్డ అని గుర్తుచేశారు. విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణ చేస్తున్న కేంద్రాన్ని ఒక్క మాట అనడు.. మోదీ అంటే చంద్రబాబుకు భయమని తెలిపారు. ప్రైవేటీకరణ మా చేతిలో ఉంటే మమ్మల్ని తిట్టండి.. మేం పడతామని స్పష్టం చేశారు. అడ్డమైన వాళ్లకు ఉత్తరాలు రాసే చంద్రబాబు ప్రధాని మోదీకి ఎందుకు రాయడని నిలదీశారు. 

2017 చంద్రబాబు దక్షిణ కొరియాకు వెళ్లి పోస్కో ప్రతినిధులను కలిశాడని, కానీ మీ పేపర్‌లో వాళ్లే వచ్చి మిమ్మల్ని కలిసినట్లు రాయించుకున్నావని ఆరోపించారు. కొరియాలో పోస్కో ప్రతినిధులను ఎందుకు కలిశాడో చంద్రబాబు ప్రజలకు బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. 2012లో ఎకానిమిక్స్ టైమ్‌లో స్టీల్ ప్లాంటు కోసం కథనం వచ్చిందని, ఆ తర్వాత జాతీయ మీడియా.. మీజాతి మీడియాలో కూడా అనేక కథనాలు వచ్చాయని వివరించారు. అప్పడు ఎందుకు చంద్రబాబు మాట్లాడలేదని ప్రశ్నించారు.

అశోక్ గజపతి రాజు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే కథ మొదలైందని.. స్టీల్ ప్లాంట్‌తో ఒప్పందం జరిగిందని మంత్రి అప్పలరాజు తెలిపారు. చంద్రబాబు వి దగుల్బాజీ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తున్న కేంద్రాన్ని వదిలి సీఎం జగన్‌ను చంద్రబాబు విమర్శిస్తుండడాన్ని తప్పుబట్టారు. ఈ పదిహేను రోజుల్లో నువ్వు.. నీ కొడుకు ఏ ఒక్కరోజైనా కేంద్రాన్ని ప్రశ్నించారా? అని ప్రశ్నించారు. 

ప్రపంచంలో ఏది జరిగినా.. చైనా దురాక్రమణలు చేసినా దానికి సీఎం జగనే కారణమని చంద్రబాబు పిచ్చిమాటలు మాట్లాడతాడని ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం బిడ్డింగ్‌కు వెళ్తే.. రాష్ట్ర ప్రభుత్వమే వెళ్లి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సాధించుకుంటుందని స్పష్టం చేశారు. ఏదో ఒకటి‌ మాట్లాడి రాజకీయ పబ్బం గడుపుకోవాలని అనుకోవడం ఈతరం సమాజం స్వాగతించదని మంత్రి అప్పలరాజు పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top