AP Govt Issues Orders On Promotion Of Grade-2 VROs - Sakshi
Sakshi News home page

గ్రేడ్‌–2 వీఆర్వోల ప్రమోషన్‌కు మార్గం సుగమం 

Apr 7 2023 7:03 AM | Updated on Apr 7 2023 10:21 AM

AP Govt Issues Orders For Promotion Of Grade-2 VROs - Sakshi

సాక్షి, అమరావతి: గ్రేడ్‌–2 వీఆర్వోలకు ప్రభుత్వం ప్రమోషన్‌ చానల్‌ కల్పించింది. ఈ మేరకు ఏపీ విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్స్‌ సర్వీస్‌ రూల్స్‌ను సవరిస్తూ తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిప్రకారం గ్రేడ్‌–2 వీఆర్వోలకు ప్రమోషన్లకు అవకాశం ఏర్పడుతుంది.

ఈ మేరకు గ్రేడ్‌–2 నుంచి గ్రేడ్‌–1గా ప్రమోషన్‌ చానల్‌ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌–166 ప్రతిని రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేతుల మీదుగా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతి రవీంద్రరాజుకు గురువారం అందజేశారు. ప్రభుత్వం జీవో జారీ చేయడంపై రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘ నాయకులు హర్షం వ్యక్తంచేశారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మెహన్‌ రెడ్డి, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జి.సాయిప్రసాద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ అధికారుల సంఘ నాయకులు దేవరాజు, గోపాలకృష్ణ, ఆరుమళ్ల నాగేశ్వరరావు తదితరులు  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement