నేడు కేసీఆర్‌కు వైఎస్‌ జగన్‌ పరామర్శ | AP CM YS Jagan visit to KCR At His Home | Sakshi
Sakshi News home page

నేడు కేసీఆర్‌కు వైఎస్‌ జగన్‌ పరామర్శ

Jan 4 2024 6:19 AM | Updated on Jan 4 2024 7:00 AM

AP CM YS Jagan visit to KCR At His Home - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలు దేరి హైదరాబాద్‌కు చేరుకుంటారు.

తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావును బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 14లోని ఆయన నివాసంలో కలిసి జగన్‌ పరామర్శిస్తారు. మధ్యాహ్నం అక్క డి నుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు.   

Advertisement
 
Advertisement
Advertisement