నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు | AP Assembly Session to start from June 21 | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Jun 21 2024 4:40 AM | Updated on Jun 21 2024 7:26 AM

AP Assembly Session to start from June 21

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ నేటి నుంచి రెండ్రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి.   శుక్రవారం ఉదయం 9.46 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణం చేయించేందుకు, అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నిక నిర్వహించేందుకు ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల లైవ్‌ కవరేజ్‌ను అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్‌ నుంచి మీడియాకు ఇవ్వనున్నట్లు సమాచార శాఖ తెలిపింది. 

టీడీపీ సీనియర్‌, ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి సభ్యులచేత ప్రమాణం చేయించనున్నారు. మొదట ముఖ్యమంత్రి చంద్రబాబు, తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రమాణం చేస్తారు. ఆ తర్వాత ఎమ్మెల్యేల అక్షర క్రమం ప్రకారం ప్రమాణ స్వీకారం చేయిస్తారు ప్రొటెం స్పీకర్. స్పీకర్ ఎన్నికకు ఇవాళే ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement