శ్రీవారిని దర్శించుకున్న రాజేంద్ర ప్రసాద్‌ | Actor Rajendra Prasad Visits Tirumala Temple | Sakshi
Sakshi News home page

తిరుమలకు ప్రముఖుల తాకిడి

Dec 30 2020 12:44 PM | Updated on Dec 30 2020 1:09 PM

Actor Rajendra Prasad Visits Tirumala Temple - Sakshi

సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం విఐపీ దర్శనంలో తెలంగాణ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, సినీనటుడు రాజేంద్రప్రసాద్, గుంటూరు మాజీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు, భాజపా ఎమ్మెల్సీ మాధవ్, జాతీయ పిల్లల పరిరక్షణ కమిషన్ సభ్యుడు ఆర్.జీ.ఆనంద్, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, వైయస్ఆర్ టియుసి అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వీరిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

తరర్వాత హాస్య నటుడు రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ 2020 మనందరికీ అద్భుతమైన పాఠాలు నేర్పిందన్నారు. కరోనా పరీక్షలు పెట్టి ఎన్నో పాఠాలు నేర్చుకునేలా చేసిందన్నారు. జీవితం అంటే ఏమిటో.. ఎలా‌ బ్రతకాలో ప్రజలందరికీ స్వామి వారు కరోనాతో తెలియజేశారని తెలిపారు. పది రోజుల పాటు వైకుంఠ ద్వారం తెరిచి ఉంచడం అందరి అదృష్టంగా అభివర్ణించారు. ఎక్కువ మంది సామాన్య భక్తులకు వైకుంఠ ద్వారం‌ గుండా స్వామి వారిని దర్శించుకునే అవకాశాన్ని టీటీడీ కల్పించడం సంతోషంగా ఉందన్నారు. తర్వాత అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2021 సంవత్సరంలో కొత్త సినిమాలతో అందరి ముందుకు రాబోతున్నానని చెప్పుకొచ్చారు. (నేడు తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విడుదల )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement