వైజాగ్ జూపార్క్‌లో "టైగ‌ర్ జాన‌కి" మృతి | 22 year old Tiger Janaki dies at Vizag Zoo | Sakshi
Sakshi News home page

వైజాగ్ జూపార్క్‌లో "టైగ‌ర్ జాన‌కి" మృతి

Jun 25 2023 9:56 AM | Updated on Jun 25 2023 10:25 AM

22 year old Tiger Janaki dies at Vizag Zoo - Sakshi

జూ పార్కులో జానకి(22) అనే ఆడ పెద్ద పులి వృద్ధాప్యంతో శనివారం మృతి చెందింది.

విశాఖపట్నం: జూ పార్కులో జానకి(22) అనే ఆడ పెద్ద పులి వృద్ధాప్యంతో శనివారం మృతి చెందింది. జూలో ఎన్‌క్లోజర్‌లో హుషారుగా తిరుగుతూ సందర్శకులను అలరించే జానకి కొన్ని నెలలుగా ఆనారోగ్యానికి గురైంది.

జూ వైద్య సిబ్బంది వైద్య సేవలు అందించినా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. వృద్ధాప్య కారణంగా అనారోగ్యానికి గురై కొన్ని రోజులుగా ఆహారం కూడా తినలేదని జూ క్యూరేటర్‌ నందనీ సలారియా తెలిపారు. ప్రస్తుతం జూలో మూడు పెద్ద పులులున్నట్లు పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement