మేహాద్రిగెడ్డపై సమగ్ర అధ్యయనం చేయాలి | - | Sakshi
Sakshi News home page

మేహాద్రిగెడ్డపై సమగ్ర అధ్యయనం చేయాలి

Sep 17 2026 12:20 AM | Updated on Sep 17 2026 12:20 AM

డాబాగార్డెన్స్‌: నగర తాగునీటి సరఫరాలో కీలకమైన మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌లో ప్రస్తుత నీటిమట్టం, నీటి లభ్యత, క్యాచ్‌మెంట్‌ ప్రాంతాల పరిస్థితిపై సమగ్ర అధ్యయనం చేపట్టాలని జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ అధికారులను ఆదేశించారు. జీవీఎంసీ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీరు పల్లంరాజు, అడ్వైజర్‌ జగన్మోహనరావు, ఇరిగేషన్‌ శాఖ ఉప కార్యనిర్వాహక ఇంజనీరు స్వామినాయుడుతో కలిసి రిజర్వాయర్‌ను బుధవారం పరిశీలించారు. రిజర్వాయర్‌ నీటిమట్టం, నీరు చేరే క్యాచ్‌మెంట్‌ ప్రాంతాలు, ప్రవాహ మార్గాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కోటపాడు, సబ్బవరం పరిసర ప్రాంతాల్లోని చెరువులు, పరీవాహక ప్రాంతాల నుంచి రిజర్వాయర్‌కు నీరు చేరుతుందని అధికారులు తెలిపారు. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ప్రస్తుత నీటిమట్టం తగ్గడానికి గల కారణాలను కమిషనర్‌ సమీక్షించారు. స్పిల్‌వే రెగ్యులేటర్‌ ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం గత ఐదేళ్ల నీటిమట్టాల రికార్డులను పరిశీలించారు. గత పదేళ్ల నీటిమట్టాల వివరాలను క్రోడీకరించి, తగ్గుదలకు కారణాలతో సమగ్ర నివేదిక అందజేయాలని పర్యవేక్షక ఇంజనీరు పల్లంరాజును ఆదేశించారు. రిజర్వాయర్‌లో డీసిల్టేషన్‌, డ్రెడ్జింగ్‌ చేపట్టేందుకు ముందుగా డ్రోన్‌ సర్వే నిర్వహించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కార్యనిర్వాహక ఇంజనీరు మురళీకృష్ణను ఆదేశించారు. పరిశీలనలో జీవీఎంసీ నీటి సరఫరా విభాగం ఉప కార్యనిర్వాహక ఇంజనీరు వీరయ్య, ఇరిగేషన్‌ శాఖ సహాయక ఇంజనీరు నళిని తదితరులు పాల్గొన్నారు.

డ్రోన్‌ సర్వేతో డీసిల్టేషన్‌, డ్రెడ్జింగ్‌కు కార్యాచరణ: జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement