రాయదుర్గం టౌన్: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు బుధవారం రాయదుర్గం పట్టణంలోని కోటలో వెలసిన శ్రీనగరేశ్వరీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో వాసవీమాత భక్తులకు ధనలక్ష్మీ అలంకరణలో దర్శనమిచ్చారు. రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500 కరెన్సీ నోట్లు (దాదాపు కోటి రూపాయలు), వెండి కాయిన్లతో అమ్మవారి అలంకరణ విశేషంగా ఆకట్టుకుంది. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తాయి రాజశేఖర్ ఆధ్వర్యంలో యువజన సంఘం అధ్యక్షుడు వంశీకృష్ణ, ప్రధాన అర్చకులు వెంకటాచలశర్మ అలంకరణలో పాలుపంచుకున్నారు. రూ.కోటితో చేసిన అమ్మవారి అలంకరణ చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
కోటి రూపాయలతో ధనలక్ష్మి అలంకరణలో రాయదుర్గంలోని వాసవీ కన్యకా పరమేశ్వరీదేవి


