అలజడులు సృష్టిస్తే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

అలజడులు సృష్టిస్తే కఠిన చర్యలు

Oct 15 2026 8:24 AM | Updated on Oct 15 2026 8:24 AM

● ప్రతి ఓటరు నిర్భయంగా ఓటు వేయాలి

● కళ్యాణదుర్గం, రాయదుర్గంలో పర్యటించిన ఎస్పీ

రాయదుర్గంటౌన్‌: ప్రశాంత వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ జగదీష్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం రాయదుర్గంలో పర్యటించిన ఆయన పోలింగ్‌ కేంద్రాలతోపాటు కౌంటింగ్‌, డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పోలీసు అధికారులతో మాట్లాడుతూ మున్సిపాలిటీతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాం కలిగించే వారిని, అలజడులు సృష్టించే వారిని ముందుగానే గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లాలో ఇప్పటికే 3500 మందిని బైండోర్‌ చేసినట్టు ఎస్పీ తెలిపారు. ప్రతి ఓటరు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు. ఆయన వెంట డీఎస్పీ దైవప్రసాద్‌, అర్బన్‌ సీఐ దేవానంద్‌, రూరల్‌ సీఐ వెంకటరమణ, మున్సిపల్‌ కమిషనర్‌ దివాకర్‌రెడ్డి, తహశీల్దార్‌ సూర్యప్రతాప్‌లు ఉన్నారు.

ట్రబుల్‌ మాంగర్లపై నిఘా ఉంచండి

కళ్యాణదుర్గం రూరల్‌: ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా, శాంతిభద్రతల పరిరక్షణ పకడ్బందీగా ఉండాలని జిల్లా ఎస్పీ జగదీష్‌ అధికారులకు సూచించారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌లు, కౌంటింగ్‌ కేంద్రాలను ఎస్పీ పరిశీలించారు. అనంతరం డీఎస్పీ కార్యాలయంలో స్థానిక పోలీసు అధికారులతో ఆయన సమావేశమై పలు సూచనలు చేశారు. ఎన్నికల వేళ తీసుకోవాల్సిన భద్రతా చర్యలు వివరించారు. సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించడంపై దిశానిర్దేశం చేశారు. రౌడీ షీటర్లు, ట్రబుల్‌ మాంగర్లపై నిరంతరం నిఘా ఉంచడమే కాకుండా కౌన్సిలింగ్‌ ఇవ్వాలని ఎస్పీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డీఓ వంసత్‌బాబు, డీఎస్పీ దైవప్రసాద్‌, మున్సిపాల్‌ కమిషనర్‌ మంజుల, సీఐలు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement