ప్రజా భక్షకులుగా కూటమి ప్రజాప్రతినిధులు | - | Sakshi
Sakshi News home page

ప్రజా భక్షకులుగా కూటమి ప్రజాప్రతినిధులు

Oct 15 2026 8:24 AM | Updated on Oct 15 2026 8:24 AM

అనంతపురం: చంద్రబాబు ప్రభుత్వ దురాగతాలు నానాటికీ మితిమీరిపోతున్నాయని, ప్రజాప్రతినిధులు కాస్త ప్రజా భక్షకులుగా మారిపోయారంటూ వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. అనంతపురం నియోజకవర్గం ఏ.నారాయణపురం పంచాయతీ పరిధిలోని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు ఐడీ కార్డులను బుధవారం ఆయన అందజేసి, మాట్లాడారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలనను ప్రజలు నేటికీ మరవలేకున్నారన్నారు. గడపగడపకు సంక్షేమ పథకాలు అందించామని గుర్తు చేశారు. పంచాయతీ పరిధిలో రూ.కోట్లు వెచ్చించి అభివృద్ధి పనులు చేయడంతో స్థిరాస్తుల విలువలను పెంచామన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలను అటకెక్కించారని, రెండున్నరేళ్లుగా ఒక్క కొత్త పింఛన్‌ ఇవ్వకపోగా ఉన్న పింఛన్లనూ తొలగించడం దుర్మార్గమని వాపోయారు. అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలకు ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్‌మోహన్‌రెడ్డి, నాయకులు పురుషోత్తం రెడ్డి, మల్లెల వేణుగోపాల్‌, రామానుజన్‌ రెడ్డి, సాకే అశోక్‌ కుమార్‌, పుల్లారెడ్డి, రామలింగారెడ్డి, అరుణ్‌ కుమార్‌ రెడ్డి, లింగారెడ్డి, అమర్నాథ్‌ రెడ్డి, సురేష్‌, లక్ష్మీనారాయణ, బండారు నరేష్‌, కుళ్లాయప్ప, వెన్నం శివారెడ్డి, జానీ పాల్గొన్నారు.

నగరంలో ప్రజల ఆస్తులకు రక్షణ కరువు

వైఎస్సార్‌సీపీ ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో అనంత వెంకటరామిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement