నీరు దొరికేది
గగనమే
మా గ్రామంలో బోరులో నీళ్లు అడుగంటాయి. ఎప్పుడైనా నీళ్లు వదిలినా చిన్నగా వస్తున్నాయి. బిందె నీరు నిండటానికి చాలా సమయం పడుతోంది. రెండు నెలలుగా నీరు దొరకడం గగనమైపోయింది. అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఒకరోజు ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేశారు. ఆ తర్వాత రోజు నుంచి పట్టించుకోలేదు. – బి.లింగమయ్య,
పాలవెంకటాపురం,
బ్రహ్మసముద్రం మండలం
అనంతపురం ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ప్రత్యేక టెట్) ఆదివారం జిల్లాలో ఎస్‌ఆర్‌ఐటీ, ఎస్‌వీఐటీ, తాడిపత్రి ఇంజినీరింగ్ కళాశాల, సీవీ రామన్ ఇంజినీరింగ్ కళాశాల, నేషనల్ కౌన్సిల్ ఫర్ ద చర్చ్ కేంద్రాల్లో నిర్వహించారు. మొత్తం 2003 మంది అభ్యర్థులకు గాను 1965 మంది హాజరుకాగా, 38 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలు రెండు విడతల్లో జరిగాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు.
టెట్ సమాచారంపై విద్యాశాఖ నిర్లక్ష్యం
జిల్లాలో ప్రత్యేక టెట్ ప్రారంభమైన తొలిరోజే పరీక్షల సమాచారాన్ని మీడియాకు అందించడంలో విద్యా శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పరీక్షలు పూర్తయి గంటలు గడుస్తున్నా కనీస వివరాలను అధికారులు వెల్లడించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం రాత్రి 8 గంటలైనా పరీక్షల సమాచారాన్ని మీడియాకు అందించలేదు. ఆ తర్వాత ఇచ్చిన సమాచారంలోనూ పూర్తిస్థాయి వివరాలు లేకపోవడం గమనార్హం.
కుందుర్పి: మండలం అప్పిలేపల్లి, ఎర్రగుంట, కొలిమిపాళ్యం, కుందుర్పి, మహంతపురం గ్రామాల్లో బోర్లు ఎండిపోవడంతో తాగునీటి ఎద్దడి నెలకొంది. కొత్తగా బోర్లు వేయించేందుకు గ్రామపంచాయతీ అధికారులు ముందుకు రావడం లేదు. స్థానిక ఎన్నికల తర్వాత నిధులు వస్తే.. తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
ఆత్మకూరు: మండల కేంద్రంలోని బీసీ కాలనీ, ఓసీ కాలనీలో తాగునీటి ఎద్దడి నెలకొంది. సిద్దరాంపురం బీసీ కాలనీలో పంచాయతీ బోరు చెడిపోయి నెలరోజులైనా పట్టించుకోకపోవడంతో ప్రజలు నీటి కోసం కటకటలాడుతున్నారు.
గుమ్మఘట్ట : మండలంలోని గోనబావి ఎస్సీ కాలనీ, రంగచేడు గ్రామాల్లో పది రోజులుగా తాగునీరు సరఫరా కావడం లేదు. దీంతో ఆయా గ్రామస్తులు వ్యవసాయ బోరుబావుల వద్దకెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. మరికొందరు ప్రైవేట్ ట్యాంకర్‌ల వద్ద నీటిని కొనుగోలు చేసి కనీస అవసరాలు తీర్చుకుంటున్నారు.
రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలం నరసనాయనికుంట గ్రామంలో చాలా వరకు పంచాయతీ బోర్లు ఎండిపోయాయి. జగనన్నకాలనీ నుంచి ప్రత్యేక పైపులైను ఏర్పాటు చేసి నీటిని సరఫరా చేస్తున్నారు. అయినా గ్రామంలో నీటి సమస్య నెలకొంది. మరీ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొళాయిలకే అరకొరగా వస్తుండటంతో ట్యాంకులకు నీళ్లు ఎక్కడం లేదు. అరకొర నీటి కోసం గ్రామస్తులు కొళాయిల వద్ద ఎదురు చూసేపరిస్థితి నెలకొంది.


