కళ్యాణదుర్గం: మండలంలోని దురదకుంట గ్రామానికి చెందిన మధుసూదన్, ఈరమాసి సావిత్రికి పాలవాయి గ్రామ సర్వే నంబర్. 201లో మొత్తం 20 ఎకరాల పొలం ఉంది. అయితే ఇటీవల ఎకోరియన్ కంపెనీ ప్రతినిధులు గాలిమరల ఏర్పాటు కోసం వారి నుంచి 7.79 ఎకరాలు లీజుకు తీసుకున్నారు.. ఏడాదికి ఎకరాకు రూ.30 వేలు ప్రకారం మాట్లాడి 6.01 ఎకరాలు గాలిమరల ఏర్పాటుకు, రస్తాకు 1.7 ఎకరాలకు రూ.12 వేలు ప్రకారం ఒప్పందం కుదుర్చుకున్నారు.
డబ్బులు ఇవ్వకుండానే పనులు..
బాధిత రైతులకు ఎకోరియన్ కంపెనీ నుంచి సుమారు రూ.16 లక్షలు అందాల్సి ఉంది. అయితే మే నెల నుంచి డబ్బులు ఇవ్వకుండానే పొలంలో పనులు చేపట్టడంపై రైతులు మండిపడుతున్నారు. పొలంలో 1100 మామిడి చెట్లు నష్టపోయామని, చెట్లకు పరిహారంగా రావాల్సిన రూ.6 లక్షలు కూడా ఇవ్వలేదన్నారు. కంపెనీ సూపర్‌వైజర్ కిశోర్ తమ వద్దకు వచ్చి మీ పొలం అంతా రూ.19 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నామని రస్తా, మామిడి చెట్ల పరిహారం ఇవ్వబోమని బెదిరిస్తున్నారని బాధిత రైతులు వాపోయారు. స్థానిక టీడీపీ నాయకుడు దొణస్వామి, ఎమ్మెల్యే అనుచరులైన గోళ్ల చంద్ర, కామక్కపల్లి చంద్ర, ఈరమాసి చక్రవర్తి తమకు రావాల్సిన డబ్బు గురించి వీడియో కూడా రికార్డ్ చేసి ఇప్పుడు మిన్నకున్నారన్నారు. ఈ విషయంపై టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అల్లుడు అవినాష్ కూడా డబ్బు ఇప్పిస్తామని మాట ఇచ్చారన్నారు.
దౌర్జన్యంగా పనులు..
పరిహారం డబ్బులు ఇవ్వకుండానే తమ పొలంలో దౌర్జన్యంగా పనులు చేస్తున్నారంటూ బాధిత రైతులు ఇటీవల ఎస్పీ జగదీష్‌ను ఆశ్రయించారు. స్పందించిన ఎస్పీ కళ్యాణదుర్గం రూరల్ సీఐ గంగాధర్‌కు ఫోన్‌లో బాధితుల పక్షాన కేసు నమోదు చేయాలని సూచించినట్లు వారు తెలిపారు. అయితే స్థానిక టీడీపీ నాయకుల ఆదేశాలతో సీఐ తమపై అక్రమ కేసులు పెట్టి పనులు అడ్డుకోకుండా బెదిరించినట్లు వారు వాపోయారు. సీఐ కంపెనీ వాళ్లతో కుమ్మకై ్క మా ఇంటికి వచ్చి దౌర్జన్యం చేస్తున్నాడన్నారు. పొలంలో ఇద్దరు పోలీసులను పెట్టి పనులు చేయించుకుంటున్నారన్నారు.
అన్నదాతలపై ఎకోరియన్ కంపెనీ దౌర్జన్యానికి దిగుతోంది. భూములు లీజుకు తీసుకుని, పరిహారం ఇవ్వకుండానే గాలిమరల పనులు మొదలుపెట్టి రైతుల జీవితాలలో చెలగాటం ఆడుతోంది. న్యాయంగా రావాల్సిన డబ్బులు
అడిగినందుకు బాధితులపై అక్రమ కేసులు, బెదిరింపులకు దిగుతుండటంతో బాధితులు తీవ్ర ఆగ్రహం
వ్యక్తం చేస్తున్నారు.
లీజు డబ్బులు ఇవ్వకుండానే
గాలిమరల ఏర్పాటు పనులు
జిల్లా ఎస్పీని ఆశ్రయించినా
అందని పరిహారం
పనులు అడ్డగించకుండా
పోలీసుల హెచ్చరికలు
కంపెనీ వెనుక ఎమ్మెల్యేతో పాటు పెద్దవాళ్లు ఉన్నారంటూ
బాధితుల ఆవేదన


