ఊరూరా కన్నీరే | - | Sakshi
Sakshi News home page

ఊరూరా కన్నీరే

Oct 12 2026 2:49 AM | Updated on Oct 12 2026 2:49 AM

● నిధుల్లేవని చేతులెత్తేస్తున్న అధికారులు

● తాగునీరు, వాడుక అవసరాలకూ కొనాల్సిందే

● పల్లెల్లో దాహం కేకలు

● పట్టించుకోని పాలకులు

● ఖాళీ బిందెలతో

రోడ్లపైకొస్తున్న అక్కచెల్లెమ్మలు

అనంతపురం న్యూటౌన్‌/ ఉరవకొండ: జిల్లాలో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. ఈ ఏడాది తాగునీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉందన్న సంకేతాలు వెలువడినా చంద్రబాబు ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు తయారు చేయడంలో విఫలమైంది. జిల్లాలోని 31 మండలాల పరిధిలో 500కు పైగా గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. గుక్కెడు నీళ్లు ఇచ్చి తమ గొంతు తడపండంటూ మహిళలు రోడ్లెక్కుతున్నారు. సాక్షాత్తు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని వజ్రకరూరు, ఉరవకొండ, విడపనకల్లు తదితర మండలాల్లో అక్కచెల్లెమ్మలు ఖాళీ బిందెలతో రహదారులను దిగ్బంధం చేస్తున్నా సమస్య తీరడం లేదు. ప్రధానంగా తుంగభద్ర డ్యామ్‌ నుంచి వచ్చే నీరు కాస్త ఆలస్యమైతే పీఏబీఆర్‌ పరిధిలోని గ్రామాల ప్రజలకు పానీపాట్లు తప్పడం లేదు. అయితే పాలకులకు ఇవేమీ పట్టడం లేదు. తాగునీటి ఎద్దడిపై జిల్లా వ్యాప్తంగా ‘సాక్షి’ నిర్వహించిన గ్రౌండ్‌ రిపోర్ట్‌లో అనేక అంశాలు వెలుగు చూశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement