మా ఊరిలో తాగునీరు సరిగా రావడం లేదు. గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఓవర్‌హెడ్ ట్యాంకు ద్వారా కొళాయిలకు నీరు సరఫరా చేసేవారు. అయితే బోర్లలో నీరు అడుగంటిపోవడంతో ట్యాంకుకు సమృద్ధిగా రావడం లేదు. ఇక శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం ట్యాంకు ఉన్నా నీళ్లు ఎప్పుడొస్తాయో తెలియడం లేదు. వచ్చినప్పుడు పనులన్నీ మానుకుని కొళాయి వద్దే గంటలతరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. చిన్నగా నీరు వస్తుండటంతో బిందె నిండటానికి పది నిమిషాలు పడుతోంది.
– బీఎస్ కావేరి, పూలచెర్ల, కణేకల్లు మండలం


