డబ్బులిచ్చి కొనాల్సిందే.. | - | Sakshi
Sakshi News home page

డబ్బులిచ్చి కొనాల్సిందే..

Oct 12 2026 2:49 AM | Updated on Oct 12 2026 2:49 AM

కళ్యాణదుర్గం రూరల్‌: కంబదూరు మండలం అచ్చంపల్లిలో 140 కుటుంబాలు నివాసమున్నాయి. 600 దాకా జనాభా ఉంది. ఇక్కడ గ్రామపంచాయతీ తరఫున వేసిన బోర్లల్లో నీరు అడుగంటిపోయాయి. రెండు నెలలవుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. తాగడానికి ప్యూరిఫైడ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ ట్యాంకర్‌ ద్వారా బిందె రూ.15 చొప్పున, వాడుక అవసరాల కోసం వ్యవసాయ బోర్ల వద్ద నుంచి నీటిని ట్యాంకర్‌లో తీసుకొస్తున్న వారి నుంచి బిందె రూ.10 చొప్పున కొంటున్నారు. డబ్బు లేని వారు రెండు మూడు బిందెల నీటితోనే సర్దుకోవాల్సిన దుస్థితి నెలకొంది. తాగునీటి సమస్యపై ధర్నా చేస్తే.. మూడు రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పిన అధికారులు పత్తా లేకుండా పోయారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కూడా పట్టించుకోవడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement