
బాబుకు పేదల సంక్షేమం పట్టదు
సీఎం చంద్రబాబుకు పేదల సంక్షేమం పట్టదు. తన అనుయాయులు బాగుపడితే చాలనుకుంటారు. అందుకే ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకే మొగ్గుచూపుతారు. ఈ క్రమంలోనే మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేందుకు సిద్ధమయ్యారు. దీన్ని కప్పిపుచ్చేందుకు మంత్రి సవిత మెడికల్ కాలేజీ నిర్మాణ పనులే ప్రారంభం కాలేదని వ్యాఖ్యానించారు. ఇంతటి పెద్ద భవనాలు ఆమె కళ్లకు కనిపించలేదా..? కళ్లు లేని కబోదిలా ఓ మంత్రి మాట్లాడటం సిగ్గు చేటు. ఎంతో మంది విద్యార్థులు తక్కువ ఫీజుతోనే వైద్యవిద్యను పూర్తి చేయాలనే ఉద్దేశంతో నాడు సీఎం హోదాలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సుమారు రూ.8 వేల కోట్లతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వాటిని ప్రజలకు అందుబాటులోకి తేవాల్సిన చంద్రబాబు పరాధీనం చేసేందుకు సిద్ధపడటం దుర్మార్గం. వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకోవాలి. లేకపోతే వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉధృతం చేస్తాం.
– జక్కంపూడి రాజా, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు