
బాలల సంరక్షణపై దృష్టి సారించండి
అనంతపురం సెంట్రల్: బాలల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి బాలల సంరక్షణ సిఫారసుల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. బాలలకు ఆశ్రయం కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థ ఆశ్రమాలను తరచూ తనిఖీలు చేయాలన్నారు. పౌష్టికాహారం సరఫరా, ఆరోగ్య సంరక్షణ, మంచి వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలోని బాలసదనం, చిల్డ్రన్‌హోమ్ తదితర కేంద్రాల్లో పిల్లల విద్యాభ్యాసంపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనమతుల్లేని ఎన్జీఓలను గుర్తించి నివేదిక సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో జోనల్ జస్టిస్ బోర్డు సభ్యుడు శ్రీనివాసులు, చైల్డ్ వెల్పేర్ కమిటీ సభ్యుడు ఓబుళపతి, డీపీఓ ఖలీల్‌బాషా, సీడీపీఓ శ్రీదేవి, వైద్యాధికారులు విష్ణుమూర్తి, జయలక్ష్మి, ఆర్డీటీ ప్రతినిధి ఆదినారాయణ పాల్గొన్నారు.
నైపుణ్యతతోనే
ఇంజినీరింగ్‌లో రాణింపు
● ఐఐఎస్‌సీ ప్రొఫెసర్ శివకుమార్‌బాబు
బుక్కరాయసముద్రం: నైపుణ్యతతోనే ఇంజినీరింగ్‌లో రాణించగలుగుతారని విద్యార్థులకు బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్‌సీ) ప్రొఫెసర్ శివకుమార్‌బాబు సూచించారు. బీకేఎస్ మండలం రోటరీపురం వద్ద ఉన్న ఎస్‌ఆర్‌ఐటీ (అటానమస్)లో సివిల్ ఇంజినీరింగ్ విభాగం వాల్ డిటెక్టరీ ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ ద్విబాషా సదస్సు జరిగింది. 60 మంది పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులతోపాటు వివిధ విద్యా సంస్థల అధ్యాపకులు హాజరై తమ పరిశోధనా పత్రాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా రిసిలియంట్ అండ్ సస్టేనబుల్ జియో టెక్నికల్ ప్రాక్టీసెస్ అంశంపై ప్రొఫెసర్ శివకుమార్‌బాబు మాట్లాడారు. సుస్తిరమైన ధీర్ఘకాలిక మౌలిక సదుపాయాల నిర్మాణంలో సివిల్ ఇంజినీర్ల బాధ్యత కీలకమన్నారు. అలాగే ‘కిర్బి బిల్డింగ్ సిస్టం అండ్ స్ట్రక్చర్’ అంశంపై సింగం వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సుబ్బారెడ్డి మాట్లాడారు. అల్ట్రాటెక్ సిమెంట్, ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి జైరాజ్ మాట్లాడుతూ.. ఆవిష్కరణాత్మక నిర్మాణ సామగ్రి నాణ్యత ప్రమాణాలు, పరిశ్రమలు – విద్యాసంస్థల అనుసంధానాలను వివరించారు. కార్యక్రమంలో ఎస్‌ఆర్‌ఐటీ ప్రిన్సిపాల్ డాక్టర్ బాలకృష్ణ, సివిల్ ఇంజినీరింగ్ విభాగం అధిపతి ప్రొఫెసర్ టీవీ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

బాలల సంరక్షణపై దృష్టి సారించండి