
న్యూఢిల్లీ: భారత్‌లో శుక్రవారం అందుబాటులోకి వచ్చిన యాపిల్ ఐఫోన్ 17 అభిమానుల్లో మేనియా సృష్టించింది.

లేటెస్ట్ ఫోన్‌ను ముందుగా దక్కించుకునేందుకు యాపిల్ స్టోర్స్ ముందు ఫ్యాన్స్ బారులు తీరారు.

కొందరు ముందు రోజు రాత్రి నుంచే దాదాపు 21 గంటల పాటు కూడా నిరీక్షిస్తూ కూర్చున్నారు. ముంబై, ఢిల్లీ, బెంగళూరులో చాంతాడంత క్యూలు కనిపించాయి.





















