అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో 22 మండలాల్లో వర్షం కురిసింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు 4 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. విడపనకల్లు 30 మి.మీ, నార్పల 22.2, యల్లనూరు 18.8 మి.మీ వర్షం కురిసింది. అలాగే, శింగనమల, పుట్లూరు, కళ్యాణదుర్గం, గార్లదిన్నె, పెద్దవడుగూరు, తాడిపత్రి, అనంతపురం, గుత్తి, ఆత్మకూరు తదితర మండలాల్లో తేలికపాటి వర్షం పడింది. సెప్టెంబర్ సాధారణ వర్షపాతం 110.9 మి.మీ కాగా ఇప్పటివరకు 71.7 మి.మీ నమోదైంది. ఓవరాల్‌గా జూన్ ఒకటి నుంచి ఈ సీజన్‌లో 269.5 మి.మీ గానూ 18.8 శాతం అధికంగా 320.2 మీ.మీ వర్షం కురిసింది. 15 మండలాల్లో అధికంగా, 13 మండలాల్లో సాధారణం కాగా మిగతా మూడు మండలాల్లో తక్కువగా వర్షపాతం నమోదైంది. 26 వర్షపు రోజులు (రెయినీడేస్) నమోదయ్యాయి.
ఎరువుల అమ్మకాలు నిలిపివేత
యాడికి: ఫర్టిలైజర్ దుకాణాల్లో తేడా ఉన్న ఎరువుల అమ్మకాలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు విజిలెన్స్ డీఎస్పీ నాగభూషణం తెలిపారు. శనివారం రాయలచెరువు గ్రామంలో ఉన్న న్యూ లక్ష్మీ వెంకటేశ్వర, లక్ష్మీ వెంకటేశ్వర, భాస్కర్ ఫర్టిలైజర్స్ దుకాణాలను మండల వ్యవసాయ అధికారి మహబూబ్‌బాషాతో కలిసి విజిలెన్స్ డీఎస్పీ నాగభూషణం, విజిలెన్స్ ఏఓ వాసుప్రకాష్, విజిలెన్స్ ఎస్‌ఐ నరేంద్ర భూపతి తనిఖీ చేశారు. న్యూ లక్ష్మీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ దుకాణంలో రికార్డులు సరిగా లేని రూ.1,85,000 విలువ గల 5 మెట్రిక్ టన్నుల ఎరువుల అమ్మకాలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
సాయీ..సర్వమూ నీవేనోయి
ప్రశాంతి నిలయం: ‘సాయీ..సర్వమూ నీవేనోయీ’ అంటూ ఏలూరు జిల్లా సత్యసాయి భక్తులు సంగీత కచేరీ నిర్వహించారు. పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన ఏలూరు సత్యసాయి భక్తులు శనివారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత సంగీత కచేరీ నిర్వహించారు. సత్యసాయిని కీర్తిస్తూ వారు చేసిన కచేరీతో సాయికుల్వంత్ సభా మందిరం మార్మోగింది.
22 మండలాల్లో వర్షం
22 మండలాల్లో వర్షం