
జిల్లా అంతటా శనివారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆ
మొక్కలు నాటి సంరక్షించాలి
● కలెక్టర్ ఆనంద్
గార్లదిన్నె: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన ‘స్వర్ణ ఆంధ్ర– స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు. జంబులదిన్నె కొట్టాల సమీపంలో మొక్కలు నాటారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులు సాగు చేసిన పండ్ల మొక్కలు, వేరుశనగ పంట పొలాలు పరిశీలించారు. గార్లదిన్నె డంపింగ్ యార్డును పరిశీలించి ‘స్వర్ణ ఆంధ్ర– స్వచ్ఛ ఆంధ్ర’పై అధికారులు, సిబ్బంది, స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకూడదన్నారు. ఇంటి వద్దకే గ్రీన్ అంబాసిడర్లు వచ్చి తడి, పొడి చెత్తను సేకరిస్తారన్నారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలన్నారు. అక్టోబర్ 2 లోపు అన్ని గ్రామాలు స్వచ్ఛంగా మారాలన్నారు. రైతులు పొలాల్లో ఫారం పాండ్లు తవ్వుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా చెరువుల్లో మట్టి తవ్వకం చేపట్టాలన్నారు. అనంతరం స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచు సుబ్బమ్మ, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహార్, డీపీఓ నాగరాజు నాయుడు, డీఏఓ ఉమామహేశ్వరమ్మ పాల్గొన్నారు.
రేపు కలెక్టరేట్‌లో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఈనెల 22వ తేదీన కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెవెన్యూ భవన్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. అర్జీతో పాటు ఫోన్, ఆధార్ నంబర్లు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు.