
ఏపీఎంఐపీకి ‘స్కోచ్’ అవార్డు
అనంతపురం అగ్రికల్చర్: ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు (ఏపీఎంఐపీ) ద్వారా జిల్లాలోని రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్లు అందించి రాష్ట్రంలో తొలిస్థానం, దేశంలో రెండో స్థానంలో నిలిచిన అనంతపురం జిల్లాకు ప్రతిష్టాత్మక ‘స్కోచ్–గోల్డ్’ అవార్డు దక్కినట్లు ఏపీఎంఐపీ పీడీ బి.రఘునాథరెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో స్కోచ్ గ్రూపు వ్యవస్థాపక చైర్మన్ సమీర్‌కొచ్చర్ నుంచి అప్పటి ఏపీడీ జి.ఫిరోజ్‌ఖాన్‌తో కలిసి అవార్డు తీసుకున్నట్లు పేర్కొన్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 18 వేల హెక్టార్ల లక్ష్యం కాగా 15,060 హెక్టార్లకు డ్రిప్ యూనిట్లు, 2,852 హెక్టార్లకు స్ప్రింక్లర్లు పంపిణీ చేసి రాష్ట్రంలో తొలిస్థానంలో నిలిచామన్నారు.