
శోభాబిందుకు ఉత్తమ అవార్డు
అనంతపురం: జేన్‌టీయూ (అనంతపురం) సీఎస్‌ఈ విభాగం ప్రొఫెసర్, ఇంక్యుబేషన్ డైరెక్టర్ డాక్టర్ సి.శోభాబిందుకు ఉత్తమ ప్రతిభావంతమైన మహిళా ఇంజినీర్ అవార్డు దక్కింది. ఈ మేరకు ద ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ విభాగం వెల్లడించింది. శనివారం విజయవాడలోని కేఎల్ రావు భవన్‌లో 58వ ఇంజినీర్స్‌డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. ఇనిస్టిట్యూట్ ఇంజనీర్స్ ఏపీ సెక్షన్ చైర్మన్ ప్రొఫెసర్ ఎంఎల్‌ఎస్ దేవకుమార్ ఈ అవార్డును అందించారు. ఈ సందర్భంగా శోభాబిందును జేఎన్‌టీయూ (అనంతపురం) వీసీ ప్రొఫెసర్ హెచ్.సుదర్శనరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్.కృష్ణయ్య, ఓఎస్డీ టూ వీసీ ప్రొఫెసర్ ఓ.దేవన్న, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చెన్నారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ఎస్. వసుంధర అభినందించారు.