
టీడీపీ నేత ఇసుక దందా బట్టబయలు
● కేసుల మీద కేసులు పెట్టి
వేధిస్తున్న ప్రభుత్వం
● తాజాగా మరోసారి రిమాండుకు
గుమ్మఘట్ట: టీడీపీ నేతల ఇసుక దందాకు అడ్డుఅదుపూ లేకుండా పోతోంది. అడ్డదారుల్లో ఇసుకను కర్ణాటకకు తరలిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. గుమ్మఘట్ట మండలంలోని వేపులపర్తి క్రాస్, భూపసముద్రం గ్రామాల సమీపంలో ఉన్న వేదావతి హగరి నుంచి నిత్యం పదుల సంఖ్యలో వాహనాల్లో ఇసుకను టీడీపీ నేత అశోక్ తరలించి సిరిగెదొడ్డి గ్రామ సమీపంలో డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి రాత్రి వేళ బెంగళూరుకు టిప్పర్ల ద్వారా తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. అశోక్ ఇసుక దందాపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు స్పందించి దాడులు నిర్వహించారు. శనివారం సిరిగెదొడ్డి సమీపంలో డంప్ చేసిన ఆరు ట్రాక్టర్ల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి టీడీపీ నేత అశోక్‌పై కేసు నమోదు చేసినట్లు రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ తెలిపారు.
ఇసుక డంప్‌ను
చూపుతున్న సీఐ
కదిరి టౌన్: వైఎస్సార్‌సీపీ ప్రచార కమిటీ కదిరి అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు మెగా అంజాద్‌పై కూటమి సర్కారు వేధింపులు కొనసాగుతున్నాయి. మెగా అంజాద్ వైఎస్సార్‌సీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రభుత్వ అవినీతిపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అంజాద్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు. సుమారు నెల రోజులు రిమాండ్‌లో ఉన్నారు. అనంతరం కొద్ది రోజులకు భార్య పేరిట భూమి కబ్జా చేశాడని పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో మరోసారి తప్పుడు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కదిరిలోని రాయలసీమ సర్కిల్‌లో తన రెడీమేడ్ దుస్తుల దుకాణంలో ఉండగా మెగా అంజాద్‌పై కొందరు టీడీపీ నాయకులు దాడి చేసి గాయపరిచారు. దీనిపై ఆయన పట్టణ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే..పోలీసులు దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయకుండా.. దెబ్బలు తిన్న అంజాద్‌పై కేసు కట్టి సబ్ జైలుకు తరలించారు.
తాజాగా మరో కేసు
తాజాగా ప్రభుత్వానికి, మంత్రి నారా లోకేష్‌కు వ్యతిరేకంగా అంజాద్ ఫేస్‌బుక్ ఐడీపై పోస్టు వచ్చిందని, కావున ఆయన్ను అరెస్టు చేసి జైలుకు పంపాలని ఐజీ కార్యాలయం నుంచి స్థానిక పోలీసులకు ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో డీఎస్పీ వెంకట శివనారాయణ స్వామి ఆధ్వర్యంలో శనివారం రాత్రి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.