
హాఫ్ నాలెడ్జ్ మంత్రి సవిత
పెనుకొండలో నేను లోకల్ అని చెప్పుకొనే మంత్రి సవితకు స్థానికంగా ఉండే మెడికల్ కాలేజీ భవనాలు కనిపించవా? ఇక్కడ ఇంత పెద్ద భవనాలు నిర్మితమై ఉంటే ఎలాంటి భవనాలు లేవంటూ రాళ్లు, గుట్టులు చూపిస్తూ తాను.. హాఫ్ నాలెడ్జ్ మంత్రి అని మరోసారి నిరూపించుకున్నారు. ఇక్కడున్న రెండంతస్తుల భవనం ఎక్కి దూకితే ఆమె కాళ్లు విరగకుంటే నిర్మాణాలు లేనట్లే! లేనిపక్షంలో మంత్రి బహిరంగ క్షమాపణలు చెప్పాలి. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసే ఆలోచనను విరమించుకోకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తాం.
– ఉషశ్రీచరణ్, వైఎస్సార్‌సీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు