
నేషనల్ పార్క్ వద్ద ముస్లింల కోలాహలం
రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్న ముస్లింలు మరుసటి రోజు శుక్రవారం విహారయాత్రలతో సరదాగా గడిపారు. ఉదయాన్నే వంటలు సిద్ధం చేసుకుని క్యారియర్లు కట్టుకుని అవసరమైన సరంజామా తీసుకుని పిల్లాపాపలతో యాత్రకు బయల్దేరారు. అనంతపురం శివారులోని నేషనల్ పార్క్ ముస్లింలతో సందడిగా కనిపించింది. పార్క్‌లో చెట్ల కింద సేద తీరి అక్కడే వంటకాలు ఆరగించి.. కబుర్లు చెప్పుకుంటూ గడిపారు. ఊయలలు, గుర్రాలు, ఒంటెల సవారీ, బోటింగ్, జంపింగ్, జారుడుబండ, వ్యాయామ పరికరాలు తదితర వాటితో సాయంత్రం వరకు సంతోషంగా గడిపారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం