మునగపాక : మండలంలోని తిమ్మరాజుపేట డావెన్జీ స్కూల్ విద్యార్థి ధాంగ్–టా మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. డావెన్సీ అంతర్జాతీయ పాఠశాలలో 8వ తరగతి చదువుకుంటున్న పి.విశ్వనాఽథ్ కీర్తన్ ఈ నెల 11,12 తేదీల్లో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని ఎస్జీఎస్ కళాశాలలో జరిగిన రాష్ట్ర స్థాయి ధాంగ్–టా మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో భాగంగా అండర్–14 విభాగంలో 48 కిలోల కేటగిరీలో పాల్గొని విజయం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 5 వరకు ఢిల్లీలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఈ మేరకు పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ కర్రి సుందరయ్య, డైరెక్టర్ రమణాజీ, పాఠశాల డీన్ దీప, ప్రిన్సిపాల్ రమేష్ తదితరులు క్రీడల్లో రాణించిన కీర్తన్ను అభినందించారు. కోచ్ తులసీరామ్ను కూడా అభినందించారు.


