కాఫీ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు భూమిపూజ | - | Sakshi
Sakshi News home page

కాఫీ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు భూమిపూజ

Oct 14 2026 1:41 AM | Updated on Oct 14 2026 1:41 AM

కాఫీ ప్రాసెసింగ్‌ యూనిట్‌ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న స్పీకర్‌, తదితరులు

మాకవరపాలెం : కాఫీ ప్రాసెసింగ్‌ యూనిట్‌ నిర్మాణానికి స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌ భూమిపూజ చేశారు. మండలంలోని శెట్టిపాలెంలో 12 ఎకరాల్లో జీసీసీ ఆధ్వర్యంలో కాఫీ ప్రాసెసింగ్‌ యూనిట్‌ నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ యూనిట్‌ నిర్మాణానికి భూమిపూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. జీసీసీ చైర్మన్‌ మాట్లాడుతూ ఏజెన్సీ వాతావరణం అనుకూలంగా లేకపోవడంతోనే ఈ ప్రాంతంలో యూనిట్‌ నిర్మిస్తున్నామన్నారు. అరకు కాఫీని ఇక్కడ నుంచి ప్రపంచవ్యాప్తంగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జీసీసీ ఎండీ శోభిక, కలెక్టర్‌ విజయకృష్ణన్‌, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తాతయ్యబాబు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement