తెలుగుతల్లి పార్క్‌ ప్రారంభోత్సవం | - | Sakshi
Sakshi News home page

తెలుగుతల్లి పార్క్‌ ప్రారంభోత్సవం

Oct 14 2026 1:41 AM | Updated on Oct 14 2026 1:41 AM

కొత్తూరులో తెలుగుతల్లి పార్కు ప్రారంభిస్తున్న వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌, కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ

అనకాపల్లి : జిల్లాలో వీఎంఆర్‌డీఏ పరిధిలో రూ.10 కోట్ల నిధులతో పలు అభివృద్ది పనులు చేపట్టడం జరిగిందని వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ఎం.వి.ప్రణవ్‌గోపాల్‌, కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. మండలంలో కొత్తూరు గ్రామంలో తెలుగుతల్లి పార్కును మంగళవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ తెలుగుతల్లి పార్కును రూ.5.40 కోట్లతో అభివృద్ధి చేశామని, తుమ్మపాల వద్ద రూ.4.40 కోట్లతో కన్వెన్షన్‌ సెంటర్‌ను ప్రారంభించడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో జేసీ శౌర్యమాన్‌ పటేల్‌, వీఎంఆర్‌డీఏ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement