30 పార్టీలతో రా.. ఒంటరిగానే ఢీకొడతా | - | Sakshi
Sakshi News home page

30 పార్టీలతో రా.. ఒంటరిగానే ఢీకొడతా

Oct 12 2026 3:01 AM | Updated on Oct 12 2026 3:01 AM

సాక్షి, విశాఖపట్నం: ‘సీఎం రమేష్‌.. నీకు దమ్ము, ధైర్యం ఉంటే ఎంపీ పదవికి రాజీనామా చేయి.. అనకాపల్లి ఎంపీగా ఇద్దరం పోటీ చేద్దాం.. నేను ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా.. నీవు ఓడిపోతే ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోవాలి’ అంటూ బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌కు మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ సవాల్‌ విసిరారు. నీవు అవసరమనుకుంటే 30 పార్టీల మద్దతుతో పోటీ చేయి.. తాను సింగిల్‌గా వైఎస్సార్‌ సీపీ తరఫునే పోటీ చేస్తానన్నారు. ఆదివారం ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో ఉన్న స్వర్గీయ మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు జయంతి సందర్భంగా ఆయన నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎక్కడో కడప నుంచి ఇక్కడికి వచ్చి ఎన్నికల ముందు మంచి చేస్తానంటూ ఈ ప్రాంత ప్రజలను నమ్మించి గద్దెనెక్కిన తర్వాత అనకాపల్లి ప్రాంతంలో ఉన్న వనరులను, మైనింగ్‌ను దోచుకుంటున్నారన్నారు. సీఎం రమేష్‌ దోపిడీలు చూసి అనకాపల్లి జిల్లా ప్రాంత ప్రజలు భయపడిపో తున్నారన్నారు. రాయలసీమ ప్రాంతంలో అక్రమ సారా వ్యాపారం చేసుకునే సారా రమేష్‌తో నాకు పోలిక ఏంటి అని అమర్‌నాథ్‌ అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు గాడిద కూడా గుర్రంలాగే కనిపిస్తుందన్నారు. గతంలో నా తండ్రి మీద కూడా ఇలాగే అప్పటి టీడీపీ నేతలు సవాల్‌ చేశారు.. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఏడుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఎంపీగా తన తండ్రి విజయం సాధించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. స్థానిక ఎన్నికలపై కనీస అవగాహన లేకుండా సీఎం రమేష్‌ మాట్లాడుతున్నా రని, చోడవరం జెడ్పీటీసీగా పోటీ చేయడం కాదు.. నీకు దమ్ముంటే అనకాపల్లి ఎంపీగానే పోటీ చేద్దామంటూ సవాల్‌ విసిరారు. సీఎం రమేష్‌ ఓటు కడపలో ఉంది.. జెడ్పీటీసీగా ఇక్కడ పోటీ చేస్తే స్క్రూట్నీలో పోటీకి అర్హత లేకుండా తీసేస్తారని, కనీస అవగాహన లేకుండా సీఎం రమేష్‌ మాట్లాడుతున్నారన్నారు. సీఎం రమేష్‌ అనేవాడు ఒక రాజకీయ బ్రోకర్‌.. ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోతే ఎంత మంచిదో అన్నట్లుగా ప్రజలు చూస్తున్నారన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌, కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌, భీమిలి సమన్వయకర్త బొత్స అనూష, ఉత్తరాంధ్ర జోన్‌–1 మహిళా విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఈర్లె అనురాధ, ముఖ్యనేతలు ఎల్లపు రఘురాం, ఫారూఖీ, గండి రవికుమార్‌, జహీర్‌ అహ్మద్‌, పేడాడ రమణికుమారి, పీవీ సురేష్‌, శ్రీవత్సవ్‌, పల్లా దుర్గారావు, పీవీ నారాయణ, దొడ్డి కిరణ్‌, శశికళ, పి.సుజాత, బిపిన్‌ జైన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ పదవికి రాజీనామా చెయ్‌.. అనకాపల్లిలో తేల్చుకుందాం

నేను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా

నువ్వు ఓడిపోతే ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోవాలి

సీఎం రమేష్‌కు గుడివాడ అమర్‌నాథ్‌ సవాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement