కోటవురట్ల : భారీ స్థాయిలో పేకాట జరుగుతోందన్న సమాచారంతో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి 14 మంది పేకాటరాయుళ్లను పట్టుకున్నారు. నక్కపల్లి సీఐ రామకృష్ణ తెలిపిన వివరాలివి..కె.వెంకటాపురం శివారున పేకాట జోరుగా జరుగుతోందన్న విశ్వనీయ సమాచారంతో నక్కపల్లి సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో ఎస్‌ఐ విజయ్‌కుమార్ సిబ్బందితో కలిసి ఆదివారం దాడి చేశారు. ఈ దాడిలో 14 మంది పట్టుబడగా వారిని అరెస్టు చేసి వారి నుంచి రూ.12,050 నగదు, పేక ముక్కలు, ఒక కారు, 10 బైకులు, 14 మొబైల్ ఫోన్లు స్వాదీనం చేసుకున్నారు. వీరిపై ఏపీ గేమింగ్ యాక్టు ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నట్టు సీఐ రామకృష్ణ తెలిపారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, కోడి పందాలు, పేకాట, గుళ్లాట, కాయిన్ గేమ్ వంటి జూదాలు ఆడినా ఏపీ గేమింగ్ యాక్టు ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటువంటి వారి సమాచారం ఇవ్వాలని కోరారు.
పండగల రద్దీ నియంత్రణకు చర్యలు


