అనకాపల్లి : ప్రశాంతమైన వాతావరణంలో దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలను నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా కమిటీ సభ్యులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారిని ఆదివారం ఎస్పీ తుహిన్ సిన్హా, సతీమణి 3వ అదనపు సివిల్ జడ్జి, 13వ అదనపు జ్యుడీషియల్ న్యాయమూర్తి నికితా సెంగర్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్, చైర్మన్ పీలా నాగశ్రీనులు ఎస్పీ దంపతులును శాలువాలతో సత్కరించి, అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదం అందజేశారు.


