అనకాపల్లి : దేశంలో 83 శాతం బహుజన సమాజం అన్ని రంగాల్లో అణిచి వేయబడుతుందని ఆర్‌పీఎస్/ఆర్‌ఈఎఫ్ (రిజర్వేషన్ల పరిరక్షణ సమితి, రిజర్వేషన్ ఎంప్లాయిస్ ఫెడరేషన్)వ్యవస్థాపకుడు డాక్టర్ పోతుల నాగరాజు అన్నారు. తుమ్మపాలలో ఓ ఫంక్షన్ హాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల బహుజన ఉద్యోగుల న్యాయభేరి సభ ఆదివారం జరిగింది. ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది జనవరిలో ఏపీ బహుజన ఉద్యోగుల న్యాయభేరి సభకు తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల ప్రతినిధులు విచ్చేయుచున్నట్లు పేర్కొన్నారు. బహుజనులు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందే విధంగా పోరాటాలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఈఎఫ్ రాష్ట్ర కన్వీనర్ ఎం.చిట్టయ్య, రాష్ట్ర అధ్యక్షుడు ఆర్,నారాయణనాయక్, తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి గాలి వినోద్, దక్షిణ జనతాపార్టీ అధ్యక్షుడు హరికుమార్ వర్మ, ఉత్తరాంధ్ర ఉద్యోగుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.


