11న బహుజన ఉద్యోగుల న్యాయభేరి సదస్సు | - | Sakshi
Sakshi News home page

11న బహుజన ఉద్యోగుల న్యాయభేరి సదస్సు

Oct 9 2026 12:56 AM | Updated on Oct 9 2026 12:56 AM

సదస్సు కరపత్రాలను ఆవిష్కరిస్తున్న రాష్ట్ర కన్వీనర్‌ చిట్టియ్య, నాయకులు

నర్సీపట్నం : ఈ నెల 11న అనకాపల్లిలో ఉత్తరాంధ్ర బహుజన ఉద్యోగుల న్యాయభేరి సభను విజయవంతం చేయాలని రాష్ట్ర కన్వీనర్‌ ఎం.చిట్టియ్య పిలుపునిచ్చారు. రిజర్వేషన్‌ పరిరక్షణ సమితి, రిజర్వేషన్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో న్యాయభేరి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రిజర్వేషన్‌ వర్గాల ఉద్యోగుల హక్కుల కోసం, న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చుకోవడానికి ఈ సదస్సు ఏర్పాటు చేశామన్నారు. 60 శాతం బీసీ జనాభా ఉన్నప్పటికీ రిజర్వేషన్‌ 25 శాతం కేటాయించడం దారుణమన్నారు. ఈ సదస్సుకు బహుజనులు అందరూ తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ నాయకులు జి.పంతులుబాబు, గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ధనార్జన్‌, ప్రధాన కార్యదర్శి ధర్మరాజు, ప్రకాష్‌, బహుజన ఐక్యవేదిక నాయకులు బొట్టా నాగరాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement