అర్హులెవరినీ జాబితా నుంచి తొలగించొద్దు | - | Sakshi
Sakshi News home page

అర్హులెవరినీ జాబితా నుంచి తొలగించొద్దు

Oct 9 2026 12:56 AM | Updated on Oct 9 2026 12:56 AM

పులపర్తి పోలింగ్‌ కేంద్రంలో సర్‌ ప్రక్రియ తనిఖీ చేస్తున్న పరిశీలకురాలు గౌతమి

యలమంచిలి రూరల్‌ : అర్హత కలిగిన ఏ ఒక్కర్నీ ఓటరు జాబితా నుంచి తొలగించొద్దని ఓటరు జాబితా పరిశీలకురాలు ఎం గౌతమి స్పష్టం చేశారు. గురువారం జిల్లాలో యలమంచిలి, పాయకరావుపేట, చోడవరం నియోజకవర్గాల్లో పలు పోలింగ్‌ కేంద్రాలను,ఆయా కేంద్రాల్లో ఓటరు జాబితాను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. బీఎల్‌వోలు ఓటర్ల తొలగింపుల విషయంలో ఇళ్లకు వెళ్లి సమగ్రమైన వివరాలు సేకరించాలన్నారు. పులపర్తిలో పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించిన ఆమె సర్‌ ప్రక్రియపై ఆరా తీశారు. యలమంచిలి నియోజకవర్గ ఈఆర్వో మనోరమ, ఏఈఆర్వో కె.వరహాలు, డీటీ బాలేశ్వర్రావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement