దుర్గారెడ్డికి సర్టిఫికెట్ అందజేస్తున్న దృశ్యం
మునగపాక: కాకరాపల్లికి చెందిన కొల్లి పృధ్వీ సాయి దుర్గారెడ్డి బాక్సింగ్ పోటీల్లో సత్తా చాటారు. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తున్న దుర్గారెడ్డి గురువారం నిర్వహించిన బాక్సింగ్ పోటీల్లో 80–86 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించారు. ఈ నెల 27న ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించనున్న ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ బాక్సింగ్ పోటీల్లో దుర్గారెడ్డి పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు.


