పని ప్రదేశంలో ఉపాధి కూలీ మృతి | - | Sakshi
Sakshi News home page

పని ప్రదేశంలో ఉపాధి కూలీ మృతి

Jul 10 2026 5:46 AM | Updated on Jul 10 2026 5:46 AM

పాయకరావుపేట : మండలంలో గల మంగవరం గ్రామానికి చెందిన ఉపాధి హామీ పథకం వేతనదారుడు మృతి చెందినట్టు ఎంపీడీవో గురువారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. మంగవరం గ్రామ పంచాయతీ పరిధిలోని చెరువు కింద కాలువలో పూడికతీత పనులు చేస్తూ గాబు సోమేశ్వరరావు (66) అనే వ్యక్తి పని ప్రదేశంలోనే పని చేస్తుండగా సొమ్మసిల్లి పడిపోయాడన్నారు. సమీపాన గల మిగిలిన వ్యక్తులు వచ్చి సపర్యలు చేసినప్పటికీ ఎంతకీ లేవకపోవడంతో చనిపోయినట్టు తోటి సభ్యులు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ నిర్ధారించుకున్నట్టు తెలిపారు. సమాచారాన్ని కుటుంబ సభ్యులకు, పై అధికారులకు తెలియజేయడం జరిగిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement