15 నుంచి నేషనల్‌ స్పోర్ట్స్‌ డే పోటీలు | - | Sakshi
Sakshi News home page

15 నుంచి నేషనల్‌ స్పోర్ట్స్‌ డే పోటీలు

Jul 10 2026 5:46 AM | Updated on Jul 10 2026 5:46 AM

నేషనల్‌ స్పోర్ట్స్‌ డే క్రీడాపోటీల పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్‌ విజయకృష్ణన్‌, జేసీ శౌర్యమాన్‌ పటేల్‌

తుమ్మపాల : నేషనల్‌ స్పోర్ట్స్‌ డే పోటీల్లో భాగంగా అమరావతి ఛాంపియన్‌షిప్‌–2026కు ఈ నెల 15 నుంచి ఆగస్టు 29 వరకు జరగనున్న పోటీల్లో ఆసక్తి గల యువతియువకులు పాల్గొనవచ్చని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అన్నారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్‌లో ఆమెతో పాటు జేసీ శౌర్యమాన్‌ పటేల్‌ చేతుల మీదుగా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 17 నుంచి 23 ఏళ్ల లోపు (బాల–బాలికల) విభాగాలకు సంబంధించి 12 క్రీడాంశాలు ఆర్చరీ, అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, బాక్సింగ్‌, బాస్కెట్‌బాల్‌, చెస్‌, హాకీ, కబడ్డీ, ఖో–ఖో, వెయిట్‌ లిఫ్టింగ్‌, వాలీబాల్‌, యోగా పోటీలు నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో జరుగుతాయన్నారు. క్రీడల్లో జిల్లా యంత్రాంగం, విద్యాలయాల క్రీడాకారులు, యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని, యువత తప్పనిసరిగా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వెబ్‌సైట్‌లో వారి ఆధార్‌ కార్డ్‌ ద్వారా రిజిస్టర్‌ అవ్వాలని జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి పూజారి శైలజ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement