ఈ స్మార్ట్‌ మీటర్లు మాకొద్దు | - | Sakshi
Sakshi News home page

ఈ స్మార్ట్‌ మీటర్లు మాకొద్దు

Jul 10 2026 5:46 AM | Updated on Jul 10 2026 5:46 AM

● డి.అగ్రహారంలో అడ్డుకున్న గ్రామస్తులు

ఎస్‌.రాయవరం : ధర్మవరం అగ్రహారంలో గృహాలకు ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ విద్యుత్‌ మీటర్లు ఏర్పాటు చేయవద్దని వినియోగదారులు నిలదీయడంతో విద్యుత్‌శాఖ సిబ్బంది గురువారం వెనుతిరిగారు. వినియోగదారులకు తెలియకుండా ప్రీపెయిడ్‌ మీటర్లు బిగించడం ఏమిటని ప్రశ్నించారు. ఈ సమయంలో ఆ గ్రామంలో అందుబాటులో ఉన్న ఏపీ రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు ఎం.అప్పలరాజు మాట్లాడుతూ ప్రస్తుతం గృహాలకు ఉన్న మీటర్లు సక్రమంగా పని చేస్తుండగా వినియోగదారులకు స్మార్ట్‌ మీటర్లు ఎందుకు బిగిస్తున్నారని ప్రశ్నించారు. ప్రస్తుత బిల్లు విధానం వినియోగదారులకు అందుబాటులో ఉందని, స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేసి బిల్లు చెల్లింపు ఒకటి రెండు రోజులు ఆలస్య అయినా వినియోదారులు చీకటిలో ఉండాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేస్తున్న మొదటిలో చెప్పి ఇప్పుడు చెప్పకుండా ఏర్పాటు చేయడం ఏమిటని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కర్రి శ్రీనుబాబు, పి.సాయికుమార్‌, ఎస్‌.సాయి, పి.శివ, వై సంజీవరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement