ఘనంగా కొత్త అమావాస్య జాతర ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా కొత్త అమావాస్య జాతర ప్రారంభం

Mar 18 2026 8:11 AM | Updated on Mar 18 2026 8:11 AM

అనకాపల్లి: ఉత్తరాంధ్ర ఇలవేల్పు గవరపాలెం నూకాంబికా అమ్మవారి దేవస్థానంలో కొత్త అమావాస్య జాతర మంగళవారం రాత్రి ఘనంగా ప్రారంభమైంది. మేళతాళాలు, డప్పు వాయిద్యాల మధ్య ఘటాలు ఊరేగించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అమ్మవారికి విశాఖ సంపత్‌ వినాయగర్‌ ఆలయ కమిటీ సభ్యులు సారె సమర్పించారు. బుధవారం సాయంత్రం 4.00 గంటల నుంచి దర్శనాలు నిలిపివేయనున్నట్టు ఆలయ సహాయ కమిషనర్‌ యాళ్ల శ్రీధర్‌, చైర్మన్‌ పీలా నాగశ్రీను పేర్కొన్నారు. భక్తులకు మళ్లీ గురువారం ఉదయం 6 గంటల నుంచి అమ్మవారి దర్శనభాగ్యం కల్పించనున్నట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement