● ఏపీ రైతు సంఘం సమావేశం తీర్మానం
మాట్లాడుతున్న జిల్లా ప్రతినిధి నాయినిబాబు
చోడవరం: గోవాడ సుగర్ ఫ్యాక్టరీని పరిక్షించుకునేందుకు పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తీర్మానించింది. సంఘం మహాజనసభ చోడవరం వాకర్స్ క్లబ్ ఆవరణంలో మంగళవారం జరిగింది. రైతు సంఘం జిల్లా కోశాధికారి గండి నాయిన్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గోవాడ సుగర్ ఫ్యాక్టరీని ఎలా పరిరక్షించుకోవాలనే అంశంపై ప్రధానంగా చర్చించారు. చెరకు రైతులకు రూ.28కోట్లు బకాయిలు ఉన్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తోందని, ఫ్యాక్టరీ పరిధిలో చెరకు ఉన్నప్పటికీ ఈ ఏడాది క్రషింగ్ చేయకుండా రైతులను నిండా ముంచారని సమావేశంలో వక్తలు ధ్వజమెత్తారు. రైతులకు చెరకు బకాయిలు చెల్లించడంతోపాటు వచ్చే క్రషింగ్ సీజన్‌కై నా ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేశారు. డీసీసీబీ మాజీ డైరెక్టర్ కోవెల జనార్దన్, వైఎస్సార్‌సీపీ చోడవరం మండల నాయకుడు తనకల జగన్, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


