దేవరాపల్లిలో శాంతి ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

దేవరాపల్లిలో శాంతి ర్యాలీ

Mar 18 2026 8:11 AM | Updated on Mar 18 2026 8:11 AM

దేవరాపల్లిలో ప్లకార్డుతో నినాదాలు చేస్తున్న విద్యార్థులు, సీపీఎం నాయుకులు వెంకన్న, దొర

దేవరాపల్లి: మండల కేంద్రం దేవరాపల్లిలో మంగళవారం రాత్రి సీపీఎం ఆధ్వర్యంలో విద్యార్థులు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ దాడులను నిరసిస్తూ నాలుగు రోడ్ల కూడలిలో యుద్ధం వద్దు...శాంతి ముద్దు అంటూ ప్లకార్డులు చేత పట్టి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న మాట్లాడుతూ ఇరాన్‌పై ఇజ్రాయిల్‌, అమెరికా దేశాలు దాడులు చేయడాన్ని తక్షణమే నిలిపివేయాలన్నారు. గ్యాస్‌ కొరతను నివారించాలని, ఇప్పటికే పెరిగిన నిత్యవసర ధరలతో సతమతమవుతున్న ప్రజలపై భారం మోపద్దని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి బి.టి. దొర తదితర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement