రెండు కిలోల గంజాయితో ఒకరి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

రెండు కిలోల గంజాయితో ఒకరి అరెస్టు

Mar 18 2026 8:11 AM | Updated on Mar 18 2026 8:11 AM

దేవరాపల్లి : అక్రమంగా రెండు కిలోల గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని దేవరాపల్లి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఎస్‌ఐ వి.సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఏజెన్సీ నుంచి గంజాయి తరలిస్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు శ్రీరాంపురం జంక్షన్‌ వద్ద మంగళవారం వాహనాలు తనిఖీ చేపట్టారు. జీనబాడు వైపు నుంచి ఓ బ్యాగ్‌తో వస్తున్న వ్యక్తి పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు అప్రమత్తమై అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి బ్యాగ్‌ తనిఖీ చేయగా రెండు కిలోల గంజాయి పట్టుబడింది. పట్టుబడిన వ్యక్తి ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహింపట్నం మండలం సుఘాలి గ్రామానికి చెందిన భూక్య హేమంత్‌కుమార్‌గా పోలీసులు గుర్తించారు. అతని వద్ద నుంచి గంజాయితో పాటు మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుందని అంచనా వేశారు. ఈ గంజాయిని ఒడిశాలో కొనుగోలు చేశాడని, చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయిస్తున్నట్టు నిందితుడు హేమంత్‌ కుమార్‌ అంగీకరించాడని ఎస్‌ఐ తెలిపారు. నిందితుడిపై గతంలో రెండు గంజాయి కేసులు నమోదు కాగా బెయిల్‌పై ఉన్నాడని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement