అర్జీదారు సమస్య తెలుసుకుంటున్న ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్‌కు 40 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా పలువురు నుంచి అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వారం భూతగాదాలు–30, కుటుంబ కలహాలు–2, ఇతర విభాగాలకు చెందినవి–8 అర్జీలు వచ్చాయన్నారు. అర్జీదారులు సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించాలని కిందస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన్‌రావు పాల్గొన్నారు.


