● ఆనందసాగరం..
నాతవరం: తాండవ రిజర్వాయరు సరుగుడు జలపాతం వద్ద సందర్శకులు కార్తీక మాసం ఆదివారం కావడంతోసందర్శకులు సరదగా గడిపారు. తాండవ ప్రాజెక్టు దిగువనున్న నల్లగొండమ్మ తల్లిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. అక్కడి పార్క్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. సరుగుడు జలపాతం వద్ద కూడా సందర్శఽకుల తాకిడి కన్పించింది. ఎత్తయిన కొండల నడుమ ప్రవహించే జలపాతంలో పెద్దా చిన్న అనే తేడా లేకుండా జలకాలాడుతూ సందడి చేశారు. మధ్యాహ్నం తాండవ సరుగుడు ప్రాంతాల్లో పలువురు సందర్శకులు సహపంక్తి భోజనాలు చేసి తాండవ ప్రాజెక్ట్‌లో నీటి అందాలు తిలకించారు.
ఎస్.రాయవరం: రేవు పోలవరం తీరంలో పిక్నిక్ పర్యాటకులతో పోటెత్తింది. పరసర ప్రాంతాల వారు ఆదివారం పెద్ద ఎత్తున తీరానికి చేరుకుని సందడి చేశారు. మధ్యాహ్నం వరకు తీరాన్ని ఆనుకుని ఉన్న తోటల్లో సందడి చేసి , సాయంత్రం అయ్యే సరికి తీరం ఇసుక తిన్నెల్లో క్రీడలతో కేరింతలు కొట్టారు,మరికొందరు కెరటాల్లో జలకాలు ఆడి సేద తీరారు.పర్యాటకులకు అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎస్‌ఐ విభీషణరావు సిబ్బందితో ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు.
● ఆనందసాగరం..
● ఆనందసాగరం..
● ఆనందసాగరం..


