ఆర్‌టీవో సహకారంతో ఆర్టీసీలో హెవీ డ్రైవింగ్ శిక్షణ
అనకాపల్లి: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్టీసీలో హెవీ డ్రైవింగ్‌కు శిక్షణ ఇచ్చి, ఆర్టీవో వారి సహకారంలో డ్రైవింగ్ లైసెన్స్‌ను అందజేయడం జరుగుతుందని జిల్లా ప్రజారవాణాశాఖ అధికారి వి.ప్రవీణ అన్నారు. స్థానిక డిపో ఆవరణలో 11వ బ్యాచ్ శిక్షణ పూర్తి అయిన 20 మంది డ్రైవర్లకు సోమవారం ఆమె సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిక్షణ పొందిన డ్రైవర్లను ఆర్టీసీలో డ్రైవర్లు అవసరం ఉన్న సమయంలో కాంట్రాక్టు పద్ధతిలో విధులకు తీసుకోవడం జరుగుతుందన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కావలసిన వ్యక్తులు దగ్గరలో ఆర్టీసీ సిబ్బందిని కలవాలన్నారు. ట్రాఫిక్ మేనేజర్ గౌరి, డ్రైవింగ్ శిక్షకుడు ఎ.వి.రమణ, డ్రైవింగ్ స్కూల్ డీఈవో బాపునాయుడు పాల్గొన్నారు.


