హైరానా..
న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 11 శ్రీ నవంబర్ శ్రీ 2025
యూరియా కోసం
రైతులు పంటల సాగుకు అవసరమయ్యే యూరియా కోసం నానా హైరానా పడుతున్నారు. ఖరీప్‌లో రైతులకు అవసరమయ్యే యూరియాను సకాలంలో తీసుకురావడంలో అధికారులు విఫలమయ్యారంటూ రైతులు విమర్శలు గుప్పిస్తున్నారు. సీజన్‌కు తగ్గ యూరియాను అందుబాటులోకి తీసుకురావాల్సిన అధికారులు కనీసం పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఎప్పుడు యూరియా దొరుకుతుందా అని రైతులు వేయి కళ్లతో ఎదురు చూడాల్సిన పరిస్థితులు జిల్లాలో దాపురించాయి.
తెలుగుభాష అభివృద్ధికి
బ్రౌన్ కృషి మరువలేనిది
సీపీ బ్రౌన్ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న
జేసీ జాహ్నవి, డీఆర్వో సత్యనారాయణరావు
తుమ్మపాల: తెలుగు భాష, సాహిత్య అభివృద్ధికి సీపీ బ్రౌన్ చేసిన కృషి మరపురానిదని జాయింట్ కలెక్టర్ ఎం.జిహ్నవి అన్నారు. కలెక్టరేట్‌లో ఆయన జయంతి వేడుకలను సోమవారం నిర్వహించి చిత్రపటానికి జేసీ జాహ్నవి, జిల్లా రెవెన్యూ అధికారి వై. సత్యనారాయణరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు నిఘంటువు రూపకల్పనలో ఆయన చేసిన సేవలు భాషా సంరక్షణకు పునాది వేశాయన్నారు. యువత తెలుగు భాషా వారసత్వాన్ని గౌరవించి, సంరక్షించే దిశగా ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ఇ.సందీప్, ఇతర అధికారులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
మునగపాక:
మునగపాక సచివాలయ ప్రాంగణంలో సోమవారం యూరియా పంపిణీ చేస్తామంటూ అధికారులు ప్రకటించారు. దీంతో రైతులు ఉదయం 8 గంటల నుంచే సచివాలయానికి చేరుకుని బారులు తీరారు. మునగపాక సచివాలయానికి 12 టన్నుల మేర యూరియా రావడంతో రైతులు కొనుగోలు చేసేందుకు ఉదయం నుంచి గంటల కొలదీ నిరీక్షించారు. వ్యవసాయాధికారులు సచివాలయానికి చేరుకొని క్యూలో నిలబడిన రైతులకు టోకెన్లు అందజేయడంతో ఈ టోకెన్ల కోసం రైతులు ఎగబడాల్సి వచ్చింది. అరకొర యూరియా రావడంతో కనీసం బస్తా అయినా దొరుకుతుందో లేదా? అని ఆవేదన చెందుతూ కష్టతరమైనప్పటికీ క్యూలో నిలబడ్డారు. టోకెన్లు తీసుకునేందుకు రైతులు అవస్థలు పడ్డారు. ఒకరిపై ఒకరు పడిపోవడంతో అతి కష్టం మీద కొంతమంది రైతులు యూరియాను తీసుకోగలిగారు. మిగిలిన రైతులు నిరాశతో వెనుతిరగాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా టోకెన్లు తీసుకున్న రైతులు సంబంధిత అధికారుల వద్దకు వెళ్లి ఖాతా నెంబర్‌తో పాటు ఆధార్ నంబరును సరిచూసుకోవాల్సి వచ్చింది. మొత్తం మీద మూడు, నాలుగు గంటల పాటు రైతులు యూరియా బస్తా కోసం కష్టపడాల్సిన పరిస్థితులు ఎదురవ్వడం పట్ల రైతులు మళ్ల సంజీవరావు,ఆడారి లక్ష్మణరావు,బొడ్డేడ రాజు తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు యూరియా విషయంలో ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో కష్టాలు తప్పడం లేదుంటూ ఆవేదన చెందుతున్నారు. ఈ విషయమై మండల వ్యవసాయాధికారి జ్యోత్న్సకుమారి వద్ద ప్రస్తావించగా లక్ష్యం మేర యూరియా తీసుకువచ్చామని కొంతమంది రైతులు అవసరం లేకున్నా యూరియా పట్టుకుపోవడంతో సమస్య తలెత్తుతుందన్నారు. దీనికి తోడు పంటలకు కాకుండా గడ్డి పెంపకానికి యూరియా తీసుకుపోవడం జరుగుతుందన్నారు. ఇప్పటికై నానా యూరియా వినియోగించాలంటూ రైతులకు పదేపదే చెబుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.
భాగస్వామ్య సదస్సుకు పక్కా ఏర్పాట్లు
హైరానా..


