నూకాంబిక సన్నిధిలో రైల్వే జీఎం దంపతులు
నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్ జనరల్ మేనేజర్ సందీప్ ఠాగూర్ దంపతులు, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజినీర్ అంకుష్ గుప్తా దంపతులు
అనకాపల్లి: స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారిని సౌత్ కోస్ట్ రైల్వే జోన్ జనరల్ మేనేజర్ సందీప్ ఠాగూర్ దంపతులు , ప్రిన్సిపల్ చీఫ్ ఇంజినీర్ అంకుష్ గుప్తా దంపతులు ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారిని మొదటిసారిగా కుటుంబ సమేతంగా దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. అనకాపల్లి రైల్వే స్టేషన్‌ల్లో అమ్మవారి చిత్రపటాన్ని రైల్వేశాఖ ఉన్నతస్థాయి అధికారులు ఆదేశాలు మేరకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం దేవదాయశాఖ సహాయ కమిషనర్ కెఎల్.సుధారాణి, ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను (గొల్లబాబు) అమ్మవారి చిత్రపటాలను, ప్రసాదాన్ని అందజేశారు.


